Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేడు తిరుమలకు మంత్రి జయరామ్‌

చిత్తూరు : కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ శుక్రవారం తిరుమలకు వస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. మంత్రి శుక్రవారం కడప జిల్లా ఒంటిమిట్ట మీదుగా తిరుపతి చేరుకుంటారు. రాత్రి తిరుమల వెళ్లి బస చేస్తారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3.30గంటలకు తిరుమల నుంచి బయలుదేరి ఒంటిమిట్టకు వెళతారని కలెక్టర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement