Abn logo
Sep 24 2021 @ 00:59AM

ఆపద్బంఽధు చెక్కులు అందజేసిన మంత్రి

ఆపద్బంధు చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

లక్ష్మణచాంద, సెప్టెంబరు 23 : మండలంలోని పీచర గ్రామ లబ్ధిదారులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం ఆపద్బంధు చెక్కులను అందజేశారు. వనజకు 55,000 నయనం రాజమల్లవ్వకు 27,000, రాజారపు భాగ్యలక్ష్మికి 35,000 లను చెక్కురూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, స్థానిక సర్పంచ్‌ బుర్రి లతా భూమేష్‌, తదితరులున్నారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ

నర్సాపూర్‌(జి), సెప్టెంబరు 23 : ఇటీవల రోడ్డుప్రమాదంలో మరణించిన రాంపూర్‌ గ్రామానికి చెందిన ఒడ్నం నర్సయ్య కుటుంబాన్ని గురువారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరామర్శించారు. భార్యలక్ష్మి, కుమారులు దీపక్‌, దీప్తిలను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఆయన మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకీ తీరనిలోటన్నారు.  వారి కుటుంబాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుదన్నారు. ఆయన వెంట మండల టీఆర్‌ఎస్‌ పార్టీ మైనారిటీ కన్వీనర్‌ ఇర్ఫాన్‌, కన్వీనర్‌ పాపెన్‌ రాజేశ్వర్‌,  జిల్లా నాయకులు సత్యనారాయణగౌడ్‌, రాంకిషన్‌రెడ్డి, జడ్‌పీటీసీ అర్గుమీది రామయ్య, యంపీపీ కొండ్రరేఖారమేష్‌, యంపీటీసీలు మంగ్లారపు మల్లేష్‌, నడిపోళ్ళ రవి, గ్రామస్దులు నారాయణ, పిప్రి రాజు, సుదర్శన్‌గౌడ్‌ ఉన్నారు.

లక్ష్మణచాంద, సెప్టెంబరు 23 : మండలంలోని పలువురిని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి గురువారం పరామర్శించారు. వడ్యాల్‌ గ్రామంలోని ప్రముఖ పత్రిక జర్నలిస్టు గుడిసె రాజేం దర్‌ యొక్క తండ్రి అయిన గుడిసె సత్తెన్న గుండెపోటుతో మరణించగా ఆయన కుటుంబాన్ని ఇదే గ్రామానికి చెందిన న్యాయవాది దుమ్మగోని రమణగౌడ్‌ యొక్క తండ్రి మరణించగా ఆయన కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర రఘునందన్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ అట్లరామ్‌రెడ్డి, నాయకులు సల్లా రాజేంద్రప్రసాద్‌, తదితరులు ఉన్నారు. 

సోన్‌, సెప్టెంబరు 23 : మండలంలోని గంజాల్‌ గ్రామంలో ఇటీవలే మృతి చెందిన బోనగిరి సతీష్‌, గుండారపు గంగన్నల బాధిత కుటుంబాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జడ్పీటీసీ జీవన్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కృష్ణప్రసాద్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు మోహినొద్దీన్‌, తదితరులు ఉన్నారు.