సూర్యుడు మీద ఉమ్మితే మీ ముఖం పైనే పడతుంది : హరీష్ ఫైర్

ABN , First Publish Date - 2021-04-11T18:30:26+05:30 IST

సూర్యుడు మీద ఉమ్మితే మీ మొఖం మీదనే పడతది.. మీరేం మాట్లాడినా మీకే తగులుతుందని ప్రతిపక్ష పార్టీలపై మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు గుప్పించారు...

సూర్యుడు మీద ఉమ్మితే మీ ముఖం పైనే పడతుంది : హరీష్  ఫైర్

సిద్ధిపేట : సూర్యుడు మీద ఉమ్మితే మీ మొఖం మీదనే పడతది.. మీరేం మాట్లాడినా మీకే తగులుతుందని ప్రతిపక్ష పార్టీలపై మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు గుప్పించారు. వర్గల్ మండలంలో ఆదివారం నాడు పర్యటించిన ఆయన.. శ్రీ లక్ష్మినర్సింహా స్వామివారిని దర్శించుకుని, హల్దీ వాగు వద్ద గోదావరి జలాలలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 


సాయుధ పోరాటాల నుండి పుట్టిన గడ్డ.. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీపై ఎవరెన్ని శాపనర్ధాలు పెట్టినా దీవెనలుగానే భావిస్తామని, తాము ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామన్నారు. నాటి ప్రభుత్వాలు రెండు వందల పెన్షన్ ఇస్తే నేడు పదింతలు ఇస్తున్నామన్నారు.


డైలాగ్స్ మాట్లాడితే కుదరదు..

‘మైక్ ఉంది కదా అని కొందరు సినిమా డైలాగ్‎లు మాట్లాడినట్లు మాట్లాడితే రాజకీయంలో కుదరదు. దమ్ముంటే.. కాంగ్రెస్, టీడీపీ, కొత్తగా వచ్చే పార్టీలు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు 10 ఏండ్లు కాంగ్రెస్ పాలన సాగించింది. తెలంగాణకు మీరు ఇచ్చిందేంటి..?.. మీ పాపాలు, నేరాలు, ఘోరాలు, గతంలో జరిగిన అన్యాయాలు ప్రజలు మరిచిపోలేదు’ అని ప్రతిపక్షాలపై హరీష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పర్యటనలో హరీష్ వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-04-11T18:30:26+05:30 IST