భూముల అమ్మకం పై రాజకీయాలొద్దు: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2021-06-14T20:53:09+05:30 IST

ప్రభుత్వం భూములను విక్రయించి తద్వారా వచ్చే ఆదాయంతో అభివృద్ధి పనులు చేపడుతుందని, కానీ కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం అనవసర రాజకీయం చేస్తున్నాయని ఆరిఽ్ధక శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

భూముల అమ్మకం పై రాజకీయాలొద్దు: హరీశ్‌రావు

సంగారెడ్డి: ప్రభుత్వం భూములను విక్రయించి తద్వారా వచ్చే ఆదాయంతో అభివృద్ధి పనులు చేపడుతుందని, కానీ కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం అనవసర రాజకీయం చేస్తున్నాయని ఆరిఽ్ధక శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు నిరర్ధక ఆస్తులు బడ్జెట్‌ ప్రసంగంలోనే చెప్పాము. పూర్తిపారదర్శకంగా భూముల అమ్మకాలు ప్రభుత్వం చేపడుతుందని ఆయన తెలిపారు. కానీ బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు దీనిని రాజకీయం చేసే లబ్ధి పొందాలను చూస్తున్నాయన్నారు. అంతే కాదు భూముల అమ్మకాన్ని రాద్ధాంతం చేసి, రాజకీయ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.


భూముల అమ్మకాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని విలువైన భూములు అమ్మి ఆంధ్రాలో ఖర్చు చేసినప్పుడు భట్టి ఎందుకు మాట్లాడలేదని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అప్పట్లో ప్రభుత్వ రంగ సంస్ధలను కూడా అమ్మడంతో పాటు 24 సంస్ధల నుంచి 45వాటాలను విక్రయించారని అన్నారు. అప్పుడూ భట్టి విక్రమార్క మాట్లాడలేదన్నారు. కానీ ప్రభుత్వం పారదర్శకంగా ఎలాంటి అక్రమాలు లేకుండా నిరర్ధక భూములను అమ్మాలని నిర్ణయిస్తే ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం శోచనీయమని అన్నారు. 


Updated Date - 2021-06-14T20:53:09+05:30 IST