సిద్ధిపేట ట్రెండ్ మార్చారు...సర్కార్ బడికి సిఫారసు సంతోషం:హరీశ్ రావు

ABN , First Publish Date - 2021-07-18T21:01:10+05:30 IST

సర్కారు బడి అర్థం మార్చారు... సహజంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు హైదరాబాదు పబ్లిక్ స్కూల్, కార్పోరేట్ విద్యా సంస్థలలో సీట్ల కోసం పైరవీకై దరఖాస్తులు వస్తాయి.

సిద్ధిపేట ట్రెండ్ మార్చారు...సర్కార్ బడికి సిఫారసు సంతోషం:హరీశ్ రావు

సిద్ధిపేట: సర్కారు బడి అర్థం మార్చారు... సహజంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు హైదరాబాదు పబ్లిక్ స్కూల్, కార్పోరేట్ విద్యా సంస్థలలో సీట్ల కోసం  పైరవీకై దరఖాస్తులు వస్తాయి.... కానీ ఒక మంత్రిగా  సిద్దిపేటలోని ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలలో సీటు ఇప్పించాలని సిఫారసు కోసం నా వద్దకు రావడం సంతోషంగా ఉన్నదని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావుసంతోషం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ పాఠశాల ఈ స్ధాయికి ఎదగడం తనకు గర్వంగా ఉన్నదని మంత్రి హరీశ్ చెప్పుకొచ్చారు. ఇందిరానగర్ హైస్కూలులో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించారు. ఆ తర్వాత నియోజకవర్గ పరిధిలోని 270 మంది విద్యా కార్మికులకు 1350 రూపాయల విలువైన నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. 

Updated Date - 2021-07-18T21:01:10+05:30 IST