Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 16 2021 @ 17:57PM

జీవనదులుగా మార్చాం: మంత్రి హరీష్‌రావు

మెదక్: నది లేని చోట కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి నదుల్లోకి నీళ్లు వదిలి జీవనదులుగా మార్చామని మంత్రి హరీష్‌రావు అన్నారు. మాసాయిపేట మండలంలోని హల్దీ ప్రాజెక్టు దగ్గర గోదావరి జలాలకు గంగాహారతి ఇచ్చి మంత్రి హరీష్‌రావు పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు ఇవ్వలేదని హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం దశ, దిశను టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement