21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు: మంత్రి హరీశ్

ABN , First Publish Date - 2021-12-15T02:01:31+05:30 IST

రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి

21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు: మంత్రి హరీశ్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కునేలా  ముందస్తు  చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్తగా చర్యగా 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మాస్కులు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలన్నారు. దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో  అందరూ అప్రమత్తంగా ఉండాలని హరీశ్ రావు సూచించారు. 

Updated Date - 2021-12-15T02:01:31+05:30 IST