ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయం: Harish rao

ABN , First Publish Date - 2021-11-13T17:32:26+05:30 IST

ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం నీలోఫర్‌ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును మంత్రి ప్రారంభించారు.

ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయం: Harish rao

హైదరాబాద్: ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం నీలోఫర్‌ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.18 కోట్లు అందించామని చెప్పారు. రూ.10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖను అభివృద్ధి చేశామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలన్నారు. కేసీఆర్ కిట్లు వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. రూ.33 కోట్లతో నీలోఫర్‌లో మరో 800 పడకలు అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్యులు నిబద్ధతతో పని చేయాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. 

Updated Date - 2021-11-13T17:32:26+05:30 IST