Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎయిడ్స్ రోగుల పట్ల చిన్న చూపు చూడొద్దు: మంత్రి Harish rao

హైదరాబాద్: ఎయిడ్స్ రోగుల పట్ల చిన్న చూపు చూడొద్దని మంత్రి హరీష్‌రావు అన్నారు. నగరంలోని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎయిడ్స్ మరణాల సంఖ్య తగ్గించగలిగామని తెలిపారు. గాలి ద్వారా, తాకడం ద్వారా ఎయిడ్స్ రాదన్నారు. ఎయిడ్స్ రాకుండా అవగాహన పెంచుదామని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం ఎయిడ్స్ రోగులకు ప్రతినెలా రెండు వేల పదహారు రూపాయలు పింఛన్ అందిస్తోందని చెప్పారు. 1.30 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారని, 70 వేల మందికి మందులు పంపిణి చేస్తున్నారురని తెలిపారు. ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేకంగా వరంగల్, హైదరాబాద్‌లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రి పేద ప్రజలకు అందుబాటులోకి రాబోతోందన్నారు. నర్సింగ్ వృత్తిలో ఉన్న విద్యార్థులకు నెలనెలా స్టైఫండ్ అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement