సిద్దిపేటలో విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుచేస్తాం- హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-09-23T21:19:11+05:30 IST

జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావుఅన్నారు.

సిద్దిపేటలో విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుచేస్తాం- హరీశ్‌రావు

సిద్దిపేట: జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావుఅన్నారు. బుధవారం పలు విత్తనకంపెనీలతో మంత్రి సమావేశయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్నివిధాలా అనుకూలమైన ప్రాంతమని అన్నారు. ఇక్కడ విత్తనోత్పత్తికేంద్రాల ఏర్పాటు చేస్తే ఆయా కంపెనీలకు ప్రభుత్వం నుంచిపూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. విత్తనోత్పత్తి సాగు వల్ల కంపెనీలు, రైతులు ఇద్దరికీ లాభం చేకూరుతుందన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు.


రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. రైతులు పండించే ప్రతి ఉత్పత్తికి మంచి ధర లభించేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రత్యేకించి రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 

Updated Date - 2020-09-23T21:19:11+05:30 IST