నేను ఆరుసార్లు గెలిస్తే.. ఐదుసార్లు ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2021-09-04T00:35:15+05:30 IST

నేను ఆరుసార్లు గెలిస్తే.. ఐదుసార్లు ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు: హరీశ్‌రావు

నేను ఆరుసార్లు గెలిస్తే.. ఐదుసార్లు ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు: హరీశ్‌రావు

హుజూరాబాద్‌: తాను ఆరుసార్లు గెలిస్తే అందులో ఐదుసార్లు ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ ‘‘ఒక్కసారి గాలి రావచ్చు.. ఇన్నిసార్లు గెలుస్తామా?. పనిచేయకపోతేనే ఇన్నిసార్లు గెలిపిస్తారా?. మాట మీద నిలబడకుంటేనే గెలిపిస్తారా?. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రతిసారి అంతకుముందు కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నా. అందుకే ప్రస్టేషన్‌తో ఈటల రాజేందర్ నాపై కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది.’’ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. 



గెల్లు శ్రీనివాస్ చాలా పేదోడని.. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చూసి కేసీఆర్ టికెట్ ఇచ్చారని హరీశ్ రావు తెలిపారు. ‘‘కొంత మంది మాకు 200 ఎకరాలున్నాయి.. ఎకరం అమ్మితే ఎలక్షన్ గెలుస్తామని చెబుతున్నారు. మాకు ప్రజలే ఆస్తి.. వారి అండతో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడు. 2లక్షల 29 వేల మందికి మేలు జరగాలా.. ఒక్క ఈటలకే మేలు జరగాలా?. హుజురాబాద్ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది. ఒక వేళ ఈటల గెలిస్తే.. వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుంది. ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజలకు మేలు కావాలని ఏమన్నా రాజీనామా చేశాడా?. రైతుబంధు రూపంలో కుడిచేత కేసీఆర్ ఎకరాకు ఐదువేలిస్తుంటే.. ఎడమ చేత్తే డీజిల్ ధరలు పెంచి కేంద్రం లాక్కుంటోంది. టీఆర్ఎస్ 30 శాతం ఫిట్ మెంట్ ఉద్యోగులకిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 7.5 శాతమే ఇచ్చింది. బండి సంజయ్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి.. ఈ ప్రాంతంలో చిన్న పనైనా చేశారా?. కేసీఆర్‌కు దండం పెట్టైనా హుజురాబాద్‌కు ఇంజినీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ తెస్తానని చెప్పారు. మరి ఆ శక్తి బీజేపీ వాళ్లకు ఉంటుందా?.’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 

 

Updated Date - 2021-09-04T00:35:15+05:30 IST