వ‌ర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-22T20:11:16+05:30 IST

మ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

వ‌ర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌భావిత‌మైన ప్రాంతాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ర్య‌టించారు. నిర్మల్ పట్టణంలోని మంజూలా పూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్, సోఫీ నగర్ కాలనీల‌ను  మంత్రి ప‌రిశీలించారు. జోరు వానలోనే ప‌లు కాల‌నీల‌లో ప‌ర్య‌టిస్తూ అధికారులకు సూచనలిస్తూ,మంత్రి  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రజలకు భరోసా క‌ల్పించారు. కాలనీ వాసులతో వారి సమస్యలపై చర్చించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. 


ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మ‌ల్ చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూ కూడా ఇంత‌టి వ‌ర్షం కుర‌వ‌లేద‌న్నారు. ప‌లు కాల‌నీలు జ‌ల‌మయ్యాయ‌ని, ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని సూచించారు. నిత్యావసరాలు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్ర‌జ‌లు కూడా బాధితుల‌కు సహాయం చేయాల‌ని కోరారు. 


జిల్లా అధికారుల‌తో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమీక్ష‌

అనంతరం జిల్లా అధికారుల‌తో కలెక్ట‌రేట్ కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ వర్షం ఇలాగే కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వర్షాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు ముంద‌స్తు చర్చలు చేపట్టాలని మంత్రి  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు.వ‌ర్ష ప్ర‌భావిత అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ఎప్ప‌టికప్పుడు నివేదిక తెప్పించుకుని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Updated Date - 2021-07-22T20:11:16+05:30 IST