అటవీశాఖ అధికారులను అభినందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-08T23:24:25+05:30 IST

దేశంలో ఎక్కువ మెక్క‌లు నాటిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ స‌హాయ మంత్రి

అటవీశాఖ అధికారులను అభినందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో ఎక్కువ మెక్క‌లు నాటిన ఏకైక  రాష్ట్రం తెలంగాణే అని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ స‌హాయ మంత్రి బాబుల్ సుప్రియో పార్లమెంట్ లో ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి  అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అట‌వీ శాఖతో  పాటు ఇత‌ర శాఖ అధికారుల కృషిని ఈ సంద‌ర్భంగా అభినందించారు. ఇదే స్పూర్తితో వ‌చ్చే సీజ‌న్ లో ప్రారంభం కానున్న‌ ఏడ‌వ విడ‌త హరిత‌హార కార్య‌క్ర‌మాన్ని విజ‌యంవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా  2019-2020 సంవ‌త్స‌రానికి గానూ 150.23 కోట్ల మొక్కలు నాటగా కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే  38.17 కోట్ల మొక్కలు నాటినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారని తెలిపారు.


పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపే లక్ష్యంగా 2015లో  సీయం కేసీఆర్ చేప‌ట్టిన హరిత‌హార కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంద‌న్నారు. ఈ  కార్యక్రమంలో పెద్దఎత్తున‌ ప్రజ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయ‌డంతో పాటు నాటిన మొక్క‌ల‌ను సంర‌క్షించాల‌ని క‌ఠిన చ‌ట్టాల‌ను తీసుకురావ‌డం, అధికారుల నిర్విరామ కృషితోనే ఇది సాధ్య‌మైంద‌ని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-08T23:24:25+05:30 IST