అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల సమగ్ర సమాచారంతో సరికొత్త యాప్‌:ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-07T23:16:31+05:30 IST

నగర, పట్టణ వాసులకు శారీర‌క ధారుడ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటు చేసిన అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చిటికెలో తెలుసుకొనే సౌలభ్యాన్ని అట‌వీ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతికి దగ్గరగా వెళ్లి ప్రశాంతత పొందాలనుకునే ప‌ట్ట‌ణ వాసుల కోసం మొబైల్ ఈ యాప్ ను వినూత్నంగా రూపొందించారు.

అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల సమగ్ర సమాచారంతో సరికొత్త యాప్‌:ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైద‌రాబాద్: నగర, పట్టణ వాసులకు శారీర‌క ధారుడ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటు చేసిన అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చిటికెలో తెలుసుకొనే సౌలభ్యాన్ని అట‌వీ శాఖ  అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతికి దగ్గరగా వెళ్లి ప్రశాంతత పొందాలనుకునే ప‌ట్ట‌ణ వాసుల కోసం మొబైల్ ఈ యాప్ ను వినూత్నంగా రూపొందించారు. శుక్ర‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో  అట‌వీ శాఖ అధికారుల‌తో క‌లిసి ఈ మొబైల్ యాప్ ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఆవిష్క‌రించారు.  హెచ్ఎండిఏ,  మేడ్చ‌ల్, రంగారెడ్డి, హైద‌రాబాద్  ప‌రిధిలో ఉన్న39 అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల‌కు సంబందించిన స‌మాచారాన్ని ఇందులో పొందుప‌రిచారు. 


రెండ‌వ ద‌శ‌లో మ‌రిన్ని అర్బ‌న్  ఫారెస్ట్  పార్కుల సమాచారాన్ని ఈ  యాప్ లో నిక్షిప్తం చేయ‌నున్నారు. సీఎం ఓఎస్డీ (హ‌రిత‌హారం) ప్రియాంక వ‌ర్గీస్ చొర‌వ‌తో ఈ ప్ర‌త్యేక మొబైల్ యాప్ పామ్ టెన్ సంస్థ‌ రూపొందించింది. అండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్ల‌లో "URBAN FOREST PARKS" అనే  ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.తెలంగాణ‌కు హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పార్క్‌ ను ఒక్కో థీమ్ తో అర్బ‌న్ ఫారెస్ట్ పార్కులుగా  తీర్చిదిద్దామ‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.కుటుంబంతో పాటు స‌ర‌ద‌గా ఈ పార్కులో సేద తీరేందుకు వ‌చ్చే ప‌ట్ట‌ణ వాసులకు వీటి స‌మ‌చారాన్ని అందించాల‌నే ఉద్దేశ్యంతో ఈ యాప్ ను రూపొందించామ‌ని ప్రియాంక వ‌ర్గీస్ వివ‌రించారు. 

Updated Date - 2022-01-07T23:16:31+05:30 IST