Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్యకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్‌: తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య పార్థీవదేహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. ధరమ్‌ కరణ్‌ రోడ్డులోని ఆయన నివాసానికి చేరుకొని పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి,  తన ప్రగాఢ సానుభూతిని తెలయజేశారు. వారికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. 


ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. అనేక పదవులను అలంకరించి, వాటికి వన్నె తీసుకువచ్చారన్నారు. సందర్భాన్ని బట్టి చలోక్తులు విసిరే వారని, సభలో చాలా హుందాగా వ్యవహరించే వారన్నారు. రోశయ్యను ఎప్పుడు కలిసిన అదిలాబాద్ జిల్లా అభివృద్ధి గురించి అడిగే వారని, జిల్లా అభివృద్ధికి నిధుల మంజూరు విషయంలో ఎప్పుడు ఏ సహాయం కావాలన్న చేస్తాను అనే వారిని  గుర్తు చేసుకున్నారు.

Advertisement
Advertisement