బూదిలిలో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం

ABN , First Publish Date - 2021-06-22T05:20:44+05:30 IST

మండలంలోని బూదిలి పంచాయతీలో సీసీరోడ్లు, మినరల్‌ వాటర్‌ప్లాంట్లను ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకర్‌నారాయణ సోమవారం శ్రీకారం చుట్టారు.

బూదిలిలో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం
విద్యార్థులకు కందిబేడలు పంపిణీ చేస్తున్న మంత్రి

గోరంట్ల, జూన 21: మండలంలోని బూదిలి పంచాయతీలో సీసీరోడ్లు, మినరల్‌ వాటర్‌ప్లాంట్లను ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకర్‌నారాయణ సోమవారం శ్రీకారం చుట్టారు. కాగానిపల్లిలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్డు, గొల్లపల్లి, బూదిలి తండా రామన్నపల్లి గ్రామాల్లో నీతి అయోగ్‌ పథకం ద్వారా రూ.13లక్షల వంతున ఖర్చుచేసి ఏర్పాటుచేసిన మినరల్‌ వాటర్‌ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా డ్వాక్రా మహిళలతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను చర్చించారు. బూదిలిలో సచివాలయ భవన నిర్మాణం పనులు, పాఠశాలలో నాడు నేడుపనులను మంత్రి పరిశీలించి మొక్కలు నాటారు. ఉన్నత పాఠశాలలో హెచఎం జనార్దనరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరాచేసిన కందిబేడల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రామాంజినరెడ్డి, ఎంపీడీఓ అంజినప్ప, ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ శ్రీనివాసులు, ఏఈ ముజమ్మిల్‌, ఏపీఎం నారాయణ, ఏపీఓ వరప్రసాద్‌, సీఐ జయనాయక్‌, ఎస్‌ఐ ఇసాక్‌బాష, హెచఎం జనార్దనరెడ్డి, వైసీపీ నాయకులు మల్లికార్జున, ఏఎంసీ చైర్మనవేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ రామాంజనేయులు, కన్వీనర్‌ ఫకృద్ధీన, నాగిరెడ్డి, కళిగేరి శంకర్‌రెడ్డి, రఘురాంరెడ్డి, ధనుంజయరెడ్డి, పాలే జయరాంనాయక్‌, పద్మనాభరెడ్డి, బోర్‌వెల్‌ రాము, టీచర్‌ శంకర్‌నారాయణ, సుకుమార్‌ గుప్త, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T05:20:44+05:30 IST