ప్రతి ధాన్యం గింజనూ కొంటాం..మంత్రి ఈటల రాజేందర్‌

ABN , First Publish Date - 2020-10-28T11:26:21+05:30 IST

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

ప్రతి ధాన్యం గింజనూ కొంటాం..మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ రూరల్‌, అక్టోబరు 27: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని రంగాపూర్‌, సిర్సపల్లి, వెంకట్రావ్‌పల్లి, పోతిరెడ్డిపేట గ్రామంల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిర్సపల్లిలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ హాస్టల్స్‌లో చదివే ప్రతి విద్యార్థికి సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామన్నారు. త్వరలోనే రేషన్‌లో కూడా సన్న బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. ాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోరే ప్రభుత్వమని, సన్న బియ్యం పండించుమని రైతులను కోరితే ప్రభుత్వ ఆదేశానుసారం సన్న వడ్లు పండించిన వారికి ధన్యవాదాలన్నారు. అకాల వర్షాల వల్ల సన్న రకం వడ్లు పండించిన రైతులు పలు విధాలుగా నష్టపోయారని, దానిని దృష్టిలో పెట్టుకొని ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆధైర్య పడవద్దని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఏజెంట్లను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.


కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బర్మవత్‌ రమ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు కొండాల్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ఏడీఏ దోమ ఆదిరెడ్డి, ఏవో సునీల్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు బింగి కరుణాకర్‌, కన్నెబోయిన తిరుమల, సువర్ణ, తాటికొండ పుల్లాచారి, టీఆర్‌ఎస్‌ నాయకులు గందె శ్రీనివాస్‌, చొల్లేటి కిషన్‌రెడ్డి, కొత్త అశోక్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-28T11:26:21+05:30 IST