Abn logo
Aug 4 2021 @ 01:27AM

జిల్లాకు బీసీ సంక్షేమశాఖ మంత్రి

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్ట్టు 3: రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చె ల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంగళవారం జిల్లాకు వచ్చారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద ఆయనకు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి,  ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జేసీ గంగాధర్‌గౌడ్‌ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.  బీసీ సంక్షేమశాఖ డీడీ యుగంధర్‌, బీసీ కార్పొరేషన ఈడీ నా గముని, డీబీసీడబ్ల్యూఓ నరసయ్య, ఏబీసీడబ్ల్యూఓ రంగ మ్మ, వార్డెన్లు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి బుధవారం ఉదయం గుత్తి లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.  మధ్యా హ్నం ఒంటిగంటకు వజ్రకరూరు మండలం కొనకొండ్ల లోని మహాత్మజ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను సందర్శిస్తారు. సాయంత్రం 4గంటలకు అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బీసీ సంక్షేమశాఖలో చేపడు తున్న నాడు-నేడు పనులు, వసతిగృహాలపై అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 6.45గంటలకు రైలుమార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు.