Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘‘సర్వాయి పాపన్న జిల్లాగా.. ‘జనగామ’’

సిద్దిపేట: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టే అంశాన్ని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం కొమురవెళ్లి మండలం కేంద్రంతో పాటు ఐనపూర్, రసులబాద్, గౌరయపల్లి గ్రామాల్లో.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 33కోటలను జయించి, బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ను రాజుగా కీర్తించాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని గడగడ లాడించిన వ్యక్తి.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.


గౌడ కులస్తులకు హైదరాబాదులో రూ.300కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించి, రూ.50కోట్లతో గౌడ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రంగు నీళ్లకు లక్షల రూపాయలు ఖర్చు చేసే రోజుల్లో.. చెట్టు నుంచి వచ్చే స్వచ్ఛమైన కల్లును బహిరంగ అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభత్వాలు కల్లును చిన్నచూపు చూశాయన్నారు. బహుజన నాయకుల పట్ల విమర్శలు చేస్తున్న వారిపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎదుగుతున్న బహుజన నాయకత్వానికి బహుజనులంతా అండగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement