గ్రామీణ ఆర్థిక పరిపుష్టే కేసీఆర్ సంకల్పం: జగదీశ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-09-08T21:14:39+05:30 IST

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను పరిపుష్టం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు

గ్రామీణ ఆర్థిక పరిపుష్టే కేసీఆర్ సంకల్పం: జగదీశ్ రెడ్డి

నకిరేకల్: వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను పరిపుష్టం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణా ఉద్యమం సమయంలోనే గ్రామీణాభివృద్ధి కై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని ఆయన వెల్లడించారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువులో ఆయన ఆరవ విడత చేపల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ కాలంలో రూపొందించిన ప్రణాళికలో భాగమే వ్యవసాయ ఉత్పత్తులకు సరిసమానంగా చేపల పెంపకం ఉందని ఆయన అన్నారు.అందుకోసమే అధికారంలోకి వచ్చిందే తడవుగా మిషన్ కాకతీయ పథకంలో బాగంగా రాష్ట్రంలో అన్ని చెరువులను పూడిక తీయించడం జరిగిందని ఆయన చెప్పారు.వ్యవసాయానికి అనుబందంగా ఉండే వృత్తులను బలోపేతం చేయడం ద్వారా ఆయా వృత్తులను ఆధారం చేసుకుని జీవించే వారి ఆదాయాన్ని పెంచాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని బయటకు తీసుకు రావడానికి సులభతరమౌతుందన్నారు.


స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,స్థానిక మున్సిపల్ చైర్మన్  తదితరులు పాల్గొన్నారు.అనంతరం భోనగిరి జిల్లాలో అదే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. భోనగిరి యాదాద్రి జిల్లాలో జరిగిన ఆరవ విడత చేపల పంపిణీ కార్యక్రమంలోప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,భోనగిరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనసభ్యులు  ఫైళ్ల శేఖర్ రెడ్డి తదితరులు

Updated Date - 2021-09-08T21:14:39+05:30 IST