పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్: మంత్రి జగదీశ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-04T22:49:31+05:30 IST

పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్: మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్: పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం ఒప్పంద సామర్ధ్యం 16,613 మేఘావాట్లని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జల,ధర్మల్,సోలార్ లతో పాటు పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఎంత అంటూ సోమవారం రోజున శాసనమండలి ప్రశ్నోత్తరాలసమయంలో టి ఆర్ ఎస్ సభ్యులు తేర చిన్నపరెడ్డి అడిగిన లేవనెత్తిన ప్రశ్నకు ఆయన వివరణాత్మకంగా వివరించారు. మొత్తం కాంట్రాక్టెడ్ కెపాసిటీ 16,613 మేఘావాట్లు కాగా అందులో టి యస్ జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ 3372.50 యం డబ్ల్యూ,హైడల్ 2,441.76 మేఘావాట్లు,సోలార్ 1,సెంట్రల్ జెనరేటింగ్ కేంద్రాల నుండి 2645 యం.డబ్ల్యూ, ఇతర మార్గాల నుండి2,300, ప్రైవేట్ సెక్టార్ నుండి 1,647  సోలార్ 3,489,పవన విద్యుత్ 128.10,నాన్ కన్వెన్షనల్ 188.90 యం డబ్ల్యూ మొత్తం 16,613 మేఘావాట్లని ఆయన సభకు వివరించారు. కాగా 2020-21 లో 56,111 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను రాష్ట్రంలో వినియోగించుకున్నారని ఆయన చెప్పారు. 


గృహ,వాణిజ్యాలకు 17,935 మిలియన్ యూనిట్లు,ఇండస్ట్రియల్, వ్యవసాయ, లిఫ్ట్ ల నిర్వహణకు గాను 38,176 యం.యు ల వినియోగం జరిగిందన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడే నాటికి 6,660 మేఘావాట్ల డిమాండ్ ఉండగా ఈ సంవత్సరం మే నాటికి ఆ డిమాండ్ 13,686 మేఘావాట్ల కు చేరిందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన పాలసీ తో 3,489 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. చత్తీస్ ఘడ్ నుండి తాత్కాలిక టారిఫ్ తో ఒక్కో యూనిట్ కు 3.90 పైసలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదే విదంగా 2020-21 నాటికి టిఎస్ డిస్కమ్ ల ఆదాయం 30,330 కోట్లు ఉండగా ఈ సంవత్సరం ఆగస్టు 31 నాటికి 13,865 కోట్లు ఆదాయం వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి సభకు వివరించారు.

Updated Date - 2021-10-04T22:49:31+05:30 IST