యావత్ ప్రపంచానికే దళిత బంధు ఓ రోల్ మోడల్

ABN , First Publish Date - 2021-10-27T23:14:07+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబంధు పధకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు.

యావత్ ప్రపంచానికే దళిత బంధు ఓ రోల్ మోడల్

భువనగిరి యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబంధు పధకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టిన రోజునే దళిత తెలంగాణ,హరిత తెలంగాణా,కోటి ఎకరాల మగణాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారని ఆయన వెల్లడించారు. హరిత తెలంగాణ కళ్లెదుటే సాక్షాత్కరిస్తుందని కోటి ఎకరాల మాగణం సస్యశ్యామలం అన్నది వరి దిగుబడి తేటతెల్లం చేసిందని మిగిలిన దళిత తెలంగాణ కోసం దళిత రూపంలో అడుగులు పడ్డాయని ఆయన తెలిపారు.దళితబందు పధకం అమలులో బాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న భోనగిరియదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమఱ్ఱి గ్రామంలో దళితబందు లబ్ధిదారులకు ఆయన యూనిట్లు పంపిణీ చేశారు.స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,జిల్లా ప్రజారిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమఱ్ఱి గ్రామంలో ఎంపిక చేసిన తొలి పదిమంది లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి యూనిట్ల ను పంపిణీ చేశారు.అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఒక నాడు తెలంగాణా ఒక స్వప్నం అని,కలలు కనే వాళ్ళు చాలా మంది ఉంటారని కానీ అవి నిజం చేసే వాళ్ళు కొందరే ఉంటారని ఆ కొందరు మహానుభావులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరని తెలంగాణ స్వప్నం నిజం చేసిన స్వాపనికుడు ఆ మహానేత అని ఆయన కొనియాడారు. అదే స్వప్నం దళిత బంధు అని ఆ స్వప్నం రేపటి నిజం అవుతుందని ఆయన చెప్పారు. దళితబందు కేవలం కుటుంబానికో పది లక్షలు ఇచ్చే పధకం ఎంత మాత్రం కాదని ఈ ప్రపంచానికి గొప్ప మార్గదర్శనం గా నిలబడే పధకం గా రూపొదిద్దు కుంటుందని ఆయన అన్నారు. భిన్న వైరుధ్యాలతో ఉండే సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుని పోతూ ఆచరణలో దళితబందు పథకాన్ని విజయవంతం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు.


తెలంగాణా ఉద్యమం లో ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడవాల్సిన సందర్భంలోనూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారన్నారు.నడిచేటప్పుడు సందేహాలు వ్యక్తం చేశారన్నారు.తెలంగాణా వస్తదో రాదో అన్న అనుమనపడ్డ వారి సంఖ్య కోకొల్లలు ,రాకుండ అడ్డుపడ్డ వారు,కుట్రలు,కుతంత్రాలు, ద్రోహాలు మోసాలు ఉండనే ఉన్నాయన్నారు.అన్నింటినీ పటాపంచలు చేయడమే కాకుండ వచ్చిన తెలంగాణా లో  తిరుగులేని ప్రజాభినంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనా దక్షుడిగా యావత్ భారతదేశంలో కీర్తింప బడుతున్న శుభసందర్బం లో మొదలు పెట్టిన పదకమే దళిత బంధు అని ఇది నిర్విరామంగా ప్రక్రియ అని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-27T23:14:07+05:30 IST