నవసమాజ నిర్మాణానికి తెలంగాణ లో పునాదులు

ABN , First Publish Date - 2021-12-17T00:58:04+05:30 IST

సామాజిక అంతరాలను తొలగించి భిన్నత్వంలో ఏకత్వం సాధించిన నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశప్రజల మన్ననలు పొందుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

నవసమాజ నిర్మాణానికి తెలంగాణ లో పునాదులు

సూర్యాపేట: సామాజిక అంతరాలను తొలగించి భిన్నత్వంలో ఏకత్వం సాధించిన నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశప్రజల మన్ననలు పొందుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నవ సమాజానికి పునాదులు వేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం యావత్ భారతదేశం లో తెలంగాణ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్న అద్భుతమైన పథకాల గురించి చర్చలు జరుగుతున్నాయన్నారు.అందులో తెలంగాణా ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన మొదటి పండుగ క్రిస్మస్ కావడం యాదృచ్చికమే అయినప్పటికీ కులాల మధ్యన, మతాల నడుమ అంతరాలను తొలగించేందుకు ఆ పండుగను ప్రభుత్వం తరపున నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించిందన్నారు.


క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు కానుకగా అందిస్తున్న దుస్తుల పంపిణి కార్యక్రమాన్ని గురువారం మంత్రి జగదీష్ రెడ్డి సూర్యపేట లో ప్రారంభించారు.అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ లు కన్న కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారు అనడానికి క్రిస్మస్, రంజాన్,బతుకమ్మ పండుగలను ప్రభుత్వ పరంగా నిర్వహించి ప్రజామోదం పొందారని ఆయన చెప్పారు.2018 ఎన్నికల్లో టి ఆర్ యస్ ప్రభుత్వానికి అన్నివర్గాల  మళ్ళీ పట్టం కట్టడమే నిదర్శనమన్నారు.


కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను ఏ రకంగా కలపొచ్చు అన్నది ఉద్యమ కాలంలో రూపొందించిన పథకాల అమలుకు శ్రీకారం చుట్టి విజయం సాధించారన్నారు.గాంధీ, అంబెడ్కర్ లు కోరుకున్న నవసమాజ నిర్మాణం కోసం ఏ ఒక్కరికి భయపడకుండా తీసుకున్న నిర్ణయాలే ముఖ్యమంత్రి కేసీఆర్ విజయ రహస్యలని ఆయన చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-12-17T00:58:04+05:30 IST