ఇంటింటికి వెళ్లి కళ్యాణాలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-22T00:15:33+05:30 IST

మూడో వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను ఇంటింటికి వెళ్లి అందించాలన్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి వినూత్న కార్యక్రమం రెండోరోజు మరింత స్పీడ్ గా కొనసాగింది.

ఇంటింటికి వెళ్లి కళ్యాణాలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

సూర్యాపేట: మూడో వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను ఇంటింటికి వెళ్లి అందించాలన్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి వినూత్న కార్యక్రమం రెండోరోజు మరింత స్పీడ్ గా  కొనసాగింది. అందరినీ ఒకదగ్గరికి చేర్చి చెక్ లు పంపిణీ చేసే కార్యక్రమానికి భిన్నంగా ఈ మారు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు అందిస్తున్న ఆడపడుచు కట్నాన్ని నేరుగా వారి వారి ఇంటికే వెళ్లి అందించాలని ఆయన నిర్ణయించారు. అందులో బాగంగా మొదటి విడత గా మొదలు పెట్టిన చెక్ ల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొన సాగుతోంది. కాలి నడకన మొదలు పెట్టి కాలనీలలో కలియ తిరుగుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో అడుగడుగునా మంత్రికి స్ధానికుల నుంచి స్వాగతం లభించింది. 


శుక్రకవారం ఉదయం తిరిగి లబ్ధిదారులకు చెక్ ల పంపిణీ చేపట్టిన కార్యక్రమం శుక్రవారం రాత్రి వరకూ కొనసాగింది.మొత్తం తొమ్మిది వార్డులలో 26 లక్షల మూడు వేల రూపాయల చెక్ లను మంత్రి జగదీష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్ లతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్ల సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.


ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆడపిల్ల పెండ్లి పేదింట్లో భారం కాకూడదని కళ్యాణలక్ష్మీ/షాది ముబారక్ పథకం ద్వారా లక్షా 116 లు పెద్దన్న పాత్రలో పెండ్లి చేసుకున్న ఆడపడుచులకు మేనమామ రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న బృహత్ పధకం ఇదన్నారు. కాగా కరోనా కట్టడికి ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆయన కోరారు.మాస్క్ లు ధరించడం,భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ఆయన చెప్పారు. కరోనా కు బయపడొద్దు అని మానసిక ధైర్యమే కరోనా కు మందు అని ఆయన అన్నారు. 

Updated Date - 2022-01-22T00:15:33+05:30 IST