దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఉచిత విద్యుత్‌ ఎందుకు ఇవ్వడం లేదు?

ABN , First Publish Date - 2020-09-16T23:31:55+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదేందీ...? తెలంగాణేతర రాష్ర్టాల్లో లేనిది ఏమిటో గమనించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతి పక్షాలను సూచించారు.

దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఉచిత విద్యుత్‌ ఎందుకు ఇవ్వడం లేదు?

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదేందీ...? తెలంగాణేతర రాష్ర్టాల్లో లేనిది ఏమిటో గమనించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతి పక్షాలను సూచించారు. వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌నందించడంతో పాటు యావత్‌ తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు మిగితా రాష్ర్టాలు ఎందుకు అందించలేకపోతున్నాయో గమనించాలని కోరారు. ఈ విషయం పై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారని, కేసీఆర్‌ లాంటి సమర్ధవంతమైన మహానేత మనకు ఉండడం మిగితా రాష్ర్టాలకు లేకపోవడాన్ని ప్రజలు గుర్తించిన విషయాన్ని మననం లోకి తీసుకోవాలనిసూచించారు. 


శాసన మండలిలోలో విద్యుత్‌ విజయాలపై జరిగన లఘు చర్చలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. 70ఏళ్లుగా  సాగిన పరిపాలనలో చట్టసభల్లో జరిగిన తతంగాన్ని ఆయన గుర్తుచేశారు. లాంతర్లు, కందిళ్లు, ఎండిపోయిన కంకుల ప్రదర్శనలు చట్టసభలలో ప్రదర్శించడమే కదా 2014 జూన్‌ వరకూ సాగిందని ఆయన ఎద్దేవా చేశారు. జూన్‌కు ముందు ఆ తర్వాత విద్యుత్‌ రంగంలో వచ్చిన మార్పులను ఒప్పుకునేందుకు ఎందుకు మనస్కరించడం లేదంటూ విపక్షాలకు ఆయన చురకలు అంటించారు. భారత దేశంలోనే 24 గంటల విద్యుత్‌నందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అని, ఏకైక సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. 


అటువంటి మహానేత ఇతర రాష్ర్టాలకు కూడా లభిస్తే ఇదే పరిస్థితి అక్కడ ఉత్పన్నమై ఉండదని అన్నారు. తామే విద్యుత్‌ను తెలంగాణకు పంపించామని ప్రగల్బిస్తున్న బిజెపి నేతలు మోదీ ఏలుబడిలో ఉన్నగుజరాత్‌తో సహా అదే పార్టీ పరిపాలిస్తున్న రాష్ర్టాలలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ విద్యుత్‌ను మిగితా అవసరాలకు 24 గంటల సరఫరా ఎందుకు చేయలేకపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. 2003 విద్యుత్‌ సవరణ బిల్లు తెలంగాణ రైతాంగానికి ప్రతిబంధకంటా మంత్రి జగదీశ్‌రెడ్డి అభివర్ణించారు. 

Updated Date - 2020-09-16T23:31:55+05:30 IST