వరి అంటే ఉరే అనేలా పరిస్థితులు: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-06T19:54:12+05:30 IST

వరి అంటే ఉరే అనేలా పరిస్థితులు మారుతున్నాయని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లాలోని..

వరి అంటే ఉరే అనేలా పరిస్థితులు: జగదీష్‌రెడ్డి

సూర్యాపేట : వరి అంటే ఉరే అనేలా పరిస్థితులు మారుతున్నాయని  మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లాలోని కేసారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, రైతు వేదికలను మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లేని విధంగా పూర్తి స్థాయిలో మూసీ ఆయకట్టు రైతాంగానికి సాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. మూసీ ఆనకట్టను ఆధునీకరణ చేసిన ఘనత టీఆర్ఎస్‌దేనని మంత్రి జగదీష్‌రెడ్డి  అన్నారు. కేసీఆర్ ముందు చూపుతో వ్యవసాయం పండుగలా సాగుతుందన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణాగా మార్చింది సీఎం కేసీఆరేనని తెలిపారు. ఉచిత విద్యుత్ , రైతు బంధు , రైతు బీమా పథకాలతో రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతాంగాన్ని చైతన్య పరచి వారి ఆదాయం పెంచేందుకే రైతు వేదికలని చెప్పారు. ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని మంత్రి జగదీష్‌రెడ్డి  పేర్కొన్నారు.

Updated Date - 2021-04-06T19:54:12+05:30 IST