48 గంటల్లో మార్పు రావాలి

ABN , First Publish Date - 2020-05-27T10:02:13+05:30 IST

పొగాకు మార్కెట్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు 48 గంటల్లో మారాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆదేశించారు.

48 గంటల్లో మార్పు రావాలి

లేకుంటే చర్యలు తప్పవు

వ్యాపారులకు మంత్రి కన్నబాబు హెచ్చరిక 

పొగాకు మార్కెట్‌పై సమీక్ష

కొనుగోళ్ల తీరుపై రైతు ప్రతినిధుల ధ్వజం

నష్టపోతున్నా పట్టించుకోరా అని ఆగ్రహం 

ఒంగోలు -2లో నిలిచిన వేలం


ఒంగోలు, మే 26 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు 48 గంటల్లో మారాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆదేశించారు. అందుకు వ్యాపారులు తగు చొరవ తీసుకొని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సూచించారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. పొగాకు మార్కెట్‌లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో మంగళవారం రాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.మంత్రి కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశానికి పొగాకు వ్యాపారులు, రైతు ప్రతినిధులు, బోర్డు అధికారులు  హాజరయ్యారు.  తొలుత రైతు ప్రతినిధులు భద్రిరెడ్డి, రమణయ్యలు మాట్లాడుతూ వ్యాపారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితి కేవలం కొవిడ్‌ 19 వలన వచ్చింది కాదని,  ఏటా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ధరలను దిగజార్జి దోచుకుంటున్నారన్నారు. 


కొనుగోళ్లలో ఆలస్యం వలన రంగు మారి, తూకం తగ్గి, ధరలు లేక రైతు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు తీరువల్ల బ్యారన్‌కు రూ. 2లక్షలు నష్టపోతున్నామని, రైతులు ఇళ్ల ను గోడౌన్లుగా వ్యాపారులు మార్చుకుంటున్నారని చెప్పారు. బోర్డు అధికారులు కూడా పంట సాగు, ఉత్పత్తి, మార్కెట్‌ తీరును వివరించారు. అందరి అభిప్రాయాలను విన్న మంత్రి కన్నబాబుమాట్లాడుతూ  రైతులకు నష్టం లేకుండా  వ్యాపారులు, బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితిలో 48 గంటలలోపు మార్పు  రావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి రైతు ప్రతినిధిగా పొగాకు బోర్డు పాలకమండలిలో ఉన్న కొండారెడ్డి, ఎస్‌బీఎస్‌ రీజయన్‌ నుంచి పి. ప్రభాకర్‌ రెడ్డి, వడ్డెళ్ల ప్రసాద్‌, ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌ నుంచి రమణయ్య, ఎన్‌ఎల్‌ఎస్‌ నుంచి బోర్డు సభ్యుడు వాసుదేవరావు మరో ఇద్దరు రైతు ప్రతినిధులు హాజరయ్యారు. 


ఒంగోలులో ఆగిన వేలం 

ఒంగోలు (రూరల్‌): ఒంగోలులోని పొగా కు వేలం కేంద్రం-2లో మంగళవారం జరిగిన వేలంలో గిట్టుబాటు ధరలు రాకపోవటంతో రైతులు వేలం నిలుపుదల చేశారు. పొగాకు మీడియం గ్రేడు రకం రూ.100 నుంచి రూ.110లకు వ్యాపార ప్రతినిధులు కొనుగో లు చేయటంతో రైతులు ఒక్కసారిగా ఆం దోళన చెంది వేలం నిర్వహణాధికారి డి.వేణుగోపాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంత రం వేలం కేంద్రం కమిటీతో రైతులు సమా వేశమయ్యారు.


రైతు నాయకుడు వడ్డెళ్ల ప్రసాద్‌ మాట్లాడుతూ గత ఏడాది మీడి యం గ్రేడు రూ.150 నుంచి రూ.175 వరకు ధర వచ్చిందని, ఈ సంవత్సరం ఇంత తక్కువగా కొనుగోలు చేయటం దారుణమ న్నారు. 667 బేళ్లు పెట్టగా 16 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారని, ఇ లాంటి పరిస్థితి ఎప్పు డూ చూడలేదన్నారు. ఇదే ధరలు కొనసాగితే దీర్ఘకాలంగా వేలంను నిలిపివేయాల్సి వస్తుంద ని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు నాయకులు బండారు రామాంజనేయులు, ఎర్రంనేని వెంకటశేష య్య, పెనుబోతు  సునీల్‌,అయినాబత్తిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T10:02:13+05:30 IST