లోకేశ్‌తో జగన్‌కు పోలికా: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-04-14T23:31:05+05:30 IST

టీడీపీ నాయకుడు నారా లోకేశ్ తిరుపతిలో చేసిన ప్రమాణం, సవాల్ పై మంత్రి కన్నబాబు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ

లోకేశ్‌తో జగన్‌కు పోలికా: మంత్రి కన్నబాబు

తిరుపతి: టీడీపీ నాయకుడు నారా లోకేశ్ తిరుపతిలో చేసిన ప్రమాణం, సవాల్‌పై మంత్రి కన్నబాబు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేశ్‌తో జగన్‌కు పోలికా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా లోకేశ్‌కూ జగన్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్‌కూ, ఒంటి చేత్తో 151 మందిని గెలిపించుకున్న జగన్‌కు పోలిక ఏంటని ఆయన ప్రశ్నించారు. లోకేశ్‌.. ఇపుడు చాలెంజ్ ఎవరికి విసురుతారని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-14T23:31:05+05:30 IST