మూడు వేల కోట్లతో విశాఖలో పనులు: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-06-17T23:23:54+05:30 IST

విశాఖ నగరంలో డిసెంబర్ నాటికి మూడు వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేసి వాటి

మూడు వేల కోట్లతో విశాఖలో పనులు:  మంత్రి కన్నబాబు

విశాఖ: విశాఖ నగరంలో డిసెంబర్ నాటికి మూడు వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేసి వాటి ప్రారంభానికి సిద్ధం చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. 450 కోట్ల రూపాయలు విలువైన పనులు రెండు మూడు నెలల్లో పూర్తవుతాయని కన్నబాబు పేర్కొన్నారు. విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుంది కాబట్టి, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారని ఆయన తెలిపారు. నగరంలో ఓపెన్ ప్రదేశాలను, పార్కులను దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. నగరంలోని 98 వార్డుల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన వివరించారు. వార్డులను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.


నగరంలో 1100 ఓపెన్ స్పేసెస్ ఉన్నట్లు గుర్తించారని, వాటి చుట్టూ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని ఆయన తెలిపారు. ప్రతి వార్డులోనూ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టౌన్ హాల్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్‌లను మ్యూజియంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. నగరంలో శానిటేషన్ సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-17T23:23:54+05:30 IST