రైతులకు ఆర్థిక ప్రయోజనాల కల్పనే లక్ష్యం: కన్నబాబు

ABN , First Publish Date - 2021-09-08T01:19:47+05:30 IST

విజయవాడ: రాష్ట్రంలో రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కన్నబాబు అన్నారు. ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి సమీక్ష

రైతులకు ఆర్థిక ప్రయోజనాల కల్పనే లక్ష్యం: కన్నబాబు

విజయవాడ: రాష్ట్రంలో రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కన్నబాబు అన్నారు. ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. నర్సరీల అభివృద్ధి , రిజిస్ట్రేషన్ , నియంత్రణ అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కూడా రైతుల కోసం భారీగా ఖర్చు చేశామని చెప్పారు.


కొబ్బరి సాగుపై మరింతగా దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సూక్ష్మ సేద్య పరికరాల (డ్రిప్, స్ప్రింక్లర్లు)పంపిణీని అక్టోబర్ 1 నుంచే  ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బోర్ల కింద వరి సాగు చేయని, గతంలో ఈ పథకం కింద లబ్ది పొందని రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. జిల్లాల్లో పని చేసే ఉద్యానవన శాఖ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన గ్రామ ఉద్యాన శాఖ సహాయకులుకు పూర్తి స్థాయి సాంకేతిక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రైతులకు డాక్టర్ వైఎస్సార్ తోటబడి శిక్షణను క్రమం తప్పకుండా నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-09-08T01:19:47+05:30 IST