Abn logo
Oct 26 2021 @ 19:29PM

రేషన్ డీలర్స్ సమ్మెపై కొడాలి సంచలన వ్యాఖ్యలు

శ్రీకాకుళం: రేషన్ డీలర్స్ సమ్మెపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. రేషన్ డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ పంపిణీ ఆగదని మంత్రి కొడాలి స్పష్టం చేసారు. ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్  చేరుతుందని కొడాలి నాని తెలిపారు. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని డీలర్లకు కొడాలి సూచించారు. ధర్నాలకు, బంద్‌లకు దిగితే భయపడమని కొడాలి నాని హెచ్చరించారు. మనకు రేషన్ సరఫరా వాహనాలు ఉన్నాయని కొడాలి నాని పేర్కొన్నారు.