Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు అవినీతి చక్రవర్తి: కొడాలి నాని

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద అవినీతి చక్రవర్తి అని మంత్రి కొడాలి నాని తీవ్రంగా ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారనే కారణంతో ప్రజలను చంద్రబాబు బూతులు తిడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని నాని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రానికి అప్పుతెచ్చి పెట్టింది చంద్రబాబు కాదా అని కొడాలి ప్రశ్నించారు.


చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నాని హెచ్చరించారు. ఎన్టీఆర్‌, వైఎస్‌ పరిపాలనకు సీఎం జగన్‌ వారసుడని మంత్రి నాని పేర్కొన్నారు. స్థానిక  సంస్థల ఎన్నికలలో చంద్రబాబును నిమ్మగడ్డ రమేష్‌ కాపాడలేక పోయారని మంత్రి నాని అన్నారు. 

Advertisement
Advertisement