విద్యార్దులను పరీక్షలకు సిద్దం చేయండి

ABN , First Publish Date - 2020-06-03T22:58:10+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనలతో ఉన్న సమయంలో జరుగుబోతున్న 10వ తరగతి పరీక్షలకు ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్ధుల్లో భయాన్ని పోగొట్టి వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులకు సూచించారు.

విద్యార్దులను పరీక్షలకు సిద్దం చేయండి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనలతో ఉన్న సమయంలో జరుగుబోతున్న 10వ తరగతి పరీక్షలకు ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్ధుల్లో భయాన్ని పోగొట్టి వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులకు సూచించారు. విద్యార్దులు భౌతిక దూరం పాటిస్తూ, ఎప్పుడూ శుభ్రమైన మాస్క్‌లు ధరించి, తరచూ చేతులను కడుక్కునేలా వారికి శానిటైజర్‌లను సరఫరా చేయాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చని అన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, హాస్టళ్లలో విద్యార్ధులకు జూన్‌ 4న ప్రత్యేకంగా హాస్టల్స్‌ తెరుస్తారని విద్యార్ధులు చేరడానికి వారికి సమాచారం పంపించాలన్నారు. వారు వచ్చే సరికే సంబంధిత వసతి గృహాలను శుభ్రపర్చి, శానిటైజ్‌ చేయాలన్నారు.


తల్లిదండ్రులు ఇంటి నుంచి నేరుగా పరీక్షా కేంద్రానికి పంపించడానికి సిద్దంగా ఉంటే తదనుగుణంగా తల్లి దండ్రుల నుంచి ఒక లేఖను ఇవ్వాలని సూచించాలన్నారు. హాస్టల్‌ వెల్ఫేఱ్‌ ఆఫీసర్‌ అటువంటి విద్యార్ధుల జాబితాను సిద్ధం చేసి సంబంఽధిత విద్యాశాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎఎస్‌డబ్బ్యూఓ తన అధికార పరిధిలోని అన్ని ప్రత్యేక హాస్టళ్లను పరిశీలించి కోవిడ్‌ నివారణతీసుకోవాలన్నారు.. గదుల్లో భౌతిక దూరాన్నిపాటించాలన్నారు. గది వారీగా విద్యార్ధుల కేటాయింపు ఖరారు చేయాలని సూచించారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆషీసర్‌పాటు, హాస్టళ్ల ఇతర ఉద్యోగులు, సిబ్బంది వంతుల వారీగా విద్యార్ధులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. 

Updated Date - 2020-06-03T22:58:10+05:30 IST