Abn logo
Aug 26 2021 @ 13:48PM

దళితబంధు ఆషామాషీ కార్యక్రమం కాదు: మంత్రి Koppula

కరీంనగర్: దళిత బంధు ఆషామాషీ కార్యక్రమం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నలుగురు లబ్ధిదారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ కొన్నినెలల్లో అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో దళిత బంధు పథకంలో 21 వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందని చెప్పారు. దళితబంధు పథకంతో దళితులు తమ కాళ్ళ మీద నిలబడతారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.