సర్కారు బడుల రూపురేఖలు మారాలి

ABN , First Publish Date - 2021-04-09T08:55:56+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, విద్యాసంస్థల్లో సమస్యలన్నీ గుర్తించి వాటిని

సర్కారు బడుల రూపురేఖలు మారాలి

పక్కా భవనాలు, డిజిటల్‌ తరగతులుండాలి 

వెంటనే మార్గదర్శకాలు రూపొందించండి 

అధికారులకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆదేశం 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, విద్యాసంస్థల్లో సమస్యలన్నీ గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని బృహత్తర విద్యాపథకం అమలుపై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ పేర్కొంది. ఈ పథకం కింద ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటితో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యకలాపాలపై చర్చించేందుకు మంత్రులతో కూడిన సబ్‌ కమిటీ గురువారం సమావేశమైంది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు అధికారులు పొల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు.


ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై తీసుకున్న చర్యలను అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉన్నత విద్య సమర్ధంగా అమలు కావాలంటే ప్రాథమిక విద్యారంగాన్ని పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా సబ్‌ కమిటీ అభిప్రాయపడింది. ది. పాఠశాల విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది పాఠశాలలపై రూ. 2వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిందని, ఈ నిధులతో పాఠశాలల సమస్యలన్నీ పరిష్కరించుకోవాలన్నారు. ఈ నిధులతో కావాల్సిన అదనపు తరగతి గదులు, తాగునీరు, పక్కాభవనాలు, డిజిటల్‌ తరగతులను సమకూర్చుకోవాలని సబ్‌ కమిటీ అధికారులను కోరింది. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది.  


ఆగస్టు నాటికి ప్రతి పల్లెకు ఇంటర్నెట్‌

ఆగస్టు నాటికి రాష్ట్రంలోని ప్రతి పల్లెకు టీ-ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్టివిటీ అందించాలని, ఈ లక్ష ్యంతోనే తాము పని చేస్తున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ బోర్డు సమావేశం గురువారం టీ-హబ్‌లో జరిగింది. పనుల పురోగతిని మంత్రి తెలుసుకున్నారు.  రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు జూన్‌ నుంచి ప్రాఽధాన్యతా క్రమంలో ఫైబర్‌ గ్రిడ్‌ను కనెక్ష్ట్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలకు కూడా టీ-ఫైబర్‌ను కనెక్ట్‌ చేయాలన్నారు. 

Updated Date - 2021-04-09T08:55:56+05:30 IST