పట్టణాలు...గ్రామాలు సమానంగా అభివృద్ధి: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-10-08T20:40:34+05:30 IST

తెలంగాణలో పట్టణాలు, గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు.

పట్టణాలు...గ్రామాలు సమానంగా అభివృద్ధి: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో పట్టణాలు, గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. శుక్రవారం శాసన మండలిలలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలను సమ్మిళితంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రికేసీఆర్‌ పనిచేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో 3శాతం భూ భాగంలో 50శాతం మంది జనాభా నివసిస్తున్నారని చెప్పారు. 


జనాభాలో సగం మంది పట్టణాల్లోనే ఉన్నట్టు తెలిపారు. పట్టణాల అభివృద్ధికి నాలుగు కమిటీలు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ విధానాన్ని తీసుకు వచ్చామని, 75గజాల లోపు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదన్నారు. రాష్టంలో నాలాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఇప్పటికే 37 కోట్లతో టాంక్‌బండ్‌ను ఆధునీకరించామని చెప్పారు. అలాగే హుస్సేన్‌ సాగర్‌ వెంట నైట్‌ బజార్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-10-08T20:40:34+05:30 IST