Abn logo
Oct 5 2021 @ 13:47PM

కరోనా కారణంగా ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయి: కేటీఆర్

హైదరాబాద్‌: కరోనా కారణంగా ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని.. కేంద్రానికి అనేక మార్లు లేఖలు రాసిన పట్టించుకోలేదని విమర్శించారు. కరోనా నష్టాల నుంచి పరిశ్రమలను కాపాడుకోవడానికి గొప్పలు చెప్పారు కానీ కేంద్రం ఏమి చేయలేదని ఆరోపించారు. కేంద్రానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేసినా.. స్పందన లేదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసింది కానీ ఎంఎస్‌ఎంఈలకు ఏమీ చేయలేదన్నారు. కేంద్రం చెప్పిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఒక పెద్ద మిధ్యని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...