స్వయంగా రంగంలోకి Minister KTR.. ‘ధిక్కారం’పై నజర్‌.. నేడు Talasani సమావేశం.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2021-10-08T18:01:24+05:30 IST

పలువురు నేతలకు ఫోన్‌ చేసి అభిప్రాయం తీసుకున్నట్టు సమాచారం...

స్వయంగా రంగంలోకి Minister KTR..  ‘ధిక్కారం’పై నజర్‌.. నేడు Talasani సమావేశం.. ఏం జరుగుతుందో..!?

  • క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా..


హైదరాబాద్‌ సిటీ : సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన కమిటీల ఎంపికలో వివాదాలపై టీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ల మధ్య విభేదాల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. డివిజన్‌ కమిటీల ఎంపిక వివాదాస్పదంగా మారిన నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా తీస్తోంది. గురువారం అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల పరుధులలోని పలువురు నేతలకు ఫోన్‌ చేసి అభిప్రాయం తీసుకున్నట్టు సమాచారం.


ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కమిటీల ఎంపికపైనా కేటీఆర్‌కు పలువురు ఫిర్యాదు చేసినట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగి గ్రేటర్‌లోని కమిటీల ఎంపిక తీరు, జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు నేడు మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అంబర్‌పేట నేతలతో సమావేశం కానున్నారు. ఇతర నియోజకవర్గాల నాయకులతోనూ చర్చించనున్నట్టు తెలిసింది. నియోజక వకర్గంలోని గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, నల్లకుంట డివిజన్‌ కమిటీల ఎంపికపై వివాదం నెలకొన్న దృష్ట్యా.. తలసాని సమావేశం నిర్వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2021-10-08T18:01:24+05:30 IST