ఉచిత తాగునీటి పంపిణీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

ABN , First Publish Date - 2021-01-12T16:53:06+05:30 IST

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పంపిణీ పథకం ప్రారంభమైంది. రెహమత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఉచిత తాగునీటి పంపిణీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పంపిణీ పథకం ప్రారంభమైంది. రెహమత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్, మంత్రులు తలసాని, మహమూద్‌అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్‌లో 10 లక్షల నల్లా కనెక్షన్లకు ఉచిత తాగునీరు అందిస్తున్నామన్నారు. ఉచిత తాగునీటి పథకంతో గ్రేటర్‌లో 97 శాతం మందికి లబ్ధి చేకురుతుందన్నారు. ఉచిత తాగునీరు కావాలంటే మార్చి 31 లోపు.. తప్పనిసరిగా మీటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్లమ్, బస్తీ ప్రజలకు మీటర్ అవసరం లేదన్నారు. 20 వేల లీటర్లు దాటితే బిల్లు కట్టాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

Updated Date - 2021-01-12T16:53:06+05:30 IST