Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీట్‌ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థిని సత్కరించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి మీనల్ కుటేరీని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మీనల్ 2021 నీట్ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్‌ను మీనల్ కలిశాడు. కష్టపడి చదవి మొదటి ర్యాంక్ సాధించిన మీనల్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. భవిష్యత్తులో మరింతగా కష్టపడి చదివి మంచి స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులను కూడా మంత్రి కేటీఆర్ అభినందించారు.

Advertisement
Advertisement