అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునే థీమ్‌ పార్క్‌ త్రిల్‌సిటీ

ABN , First Publish Date - 2021-09-11T20:00:08+05:30 IST

జంటనగాల్లోని అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునే విధంగా నిర్మితమైన అత్యాధునిక థీమ్‌ పార్క్‌ త్రిల్‌సిటీ (ప్రపంచ స్థాయి గేమింగ్‌, వినోద సౌకర్యాలతో కూడిన ఉద్యానవనం)ను మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రారంభించారు.

అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునే థీమ్‌ పార్క్‌ త్రిల్‌సిటీ

హైదరాబాద్‌: జంటనగాల్లోని అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునే విధంగా నిర్మితమైన అత్యాధునిక థీమ్‌ పార్క్‌ త్రిల్‌సిటీ (ప్రపంచ స్థాయి గేమింగ్‌, వినోద సౌకర్యాలతో కూడిన ఉద్యానవనం)ను మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రారంభించారు. నగరంలోని పీవీఘాట్‌ను ఆనుకుని నిర్మించిన ఈ త్రిల్‌సిటీలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని అలరించే విధంగా నిర్మించినట్టు త్రిల్‌సిటీ డైరెక్టర్‌ రజనీకాంత్‌ తెలిపారు. వివిధ రకాల సాహస క్రీడలు (గేమింగ్‌)తో త్రిల్‌ పొందే ఔత్సాహికులందరికీ ఈ త్రిల్‌ సిటీ మంచి ఆనందాన్ని ఇస్తుందన్నారు.


ఇందులో రైడింగ్‌ మాన్‌స్టర్‌ థియేటర్‌, స్ప్లాష్‌ కోస్టర్‌, ఫ్లైట్‌ సిమ్యులేటర్లు, బౌలింగ్‌ అల్లే, స్కోడా కార్‌ డైవర్‌, ట్రైనింగ్‌ సిమ్యులేటర్‌, క్రికెట్‌ సిమ్యులేటర్‌, బంపర్‌ కార్లు, ఫుట్‌సాల్‌, మ్యాజిక్‌ ట్రైన్‌, హార్స్‌ రంగుల రాట్నం, ఇలా అనేక రకాల గేమింగ్‌ జోన్‌తో పాటు వివిధ రకాల రుచికరమైన ఆహారం (ఫుడ్‌ కోర్ట్‌లు) కూడా అందుబాటులో ఉంటాయన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్న వారు రోజంతా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు త్రిల్‌సిటీ ఒక వేదిక కానుందన్నారు. 

Updated Date - 2021-09-11T20:00:08+05:30 IST