Abn logo
Sep 13 2021 @ 17:50PM

జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్: జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వివరాలతో సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా విగ్రహాల మళ్లింపుపై అధికారుల దృష్టి పెట్టాలన్ననారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బల్దియా, నిమజ్జనానికి 23 మినీ చెరువులు సిద్ధం చేయాలని ఆదేశించారు. విగ్రహాలకు జియో ట్యాగింగ్, బల్దియా సూచించిన చెరువుల్లోనే విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేయలని సూచించారు. ఏ విగ్రహం ఏ చెరువులో నిమజ్జనం చేయాలో జియో ట్యాగింగ్‌లో పొందుపర్చాలని నిర్ణయించారు. విగ్రహాల నిమజ్జనంలో గందరగోళం లేకుండా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయలన్నారు.