Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 12:32PM

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ విలీనంపై మంత్రి కేటీఆర్ ప్రజాభిప్రాయాన్ని కోరారు. కంటోన్మెంట్‌ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న అభిప్రాయానికి తాను అంగీకరిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రజలంతా ట్విట్టర్ వేదికగా తమ.. తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. కంటోన్మెంట్‌ బోర్డు పాలన సరిగా జరగడంలేదని, ప్రజల అవసరాలు తీర్చడంలేదనే విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు.. కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దాని ప్రకారం విలీనం చేయాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో ఉన్న స్థానికులు తమ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్న నేపథ్యంలో.. విలీనం చేస్తే ఎలాఉంటుందన్నదానిపై మంత్రి కేటీఆర్ బుధవారం ట్వీట్టర్‌లో స్థానికుల నుంచి సూచనలు కోరారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement