సెలవులను వృధా చేసుకోవద్దు

ABN , First Publish Date - 2022-01-18T13:35:17+05:30 IST

పాఠశాలల సెలవులను విద్యార్థులు వృధా చేసు కోవద్దని, చదువుపై నిర్లక్ష్యం చూపరాదని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ హితవు పలికారు. ‘కల్వి’ చానల్‌లో ప్రసారమయ్యే తరగతులకు

సెలవులను వృధా చేసుకోవద్దు

- చదువుపై నిర్లక్ష్యం వద్దు

- విద్యార్థులకు మంత్రి అన్బిల్‌ మహేష్‌  సూచన


పెరంబూర్‌(చెన్నై): పాఠశాలల సెలవులను విద్యార్థులు వృధా చేసు కోవద్దని, చదువుపై నిర్లక్ష్యం చూపరాదని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ హితవు పలికారు. ‘కల్వి’ చానల్‌లో ప్రసారమయ్యే తరగతులకు హాజరుకావాలని సూచించారు. పుదుకోటలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ నెలాఖరు వరకు కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందనే వైద్యనిపుణుల హెచ్చరికలతో, పాఠశాలలకు ఈ నెల 31వ తేది వరకు సెలవులు ప్రకటించామన్నారు. పబ్లిక్‌ పరీక్షలు రాసే విద్యార్థులు సెలవులని భావించి, చదువును నిర్లక్ష్యం చేయొద్దన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాల్లో సందేహాలను ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన కల్వి టీవీ ప్రసారాలను అభివృద్ధి చేసేలా విద్యావేత్తలతో చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-01-18T13:35:17+05:30 IST