నేను ఆరోగ్యంగానే ఉన్నా : మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2020-08-08T22:28:10+05:30 IST

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

నేను ఆరోగ్యంగానే ఉన్నా : మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. మల్లారెడ్డికి కరోనా సోకడంతో ఇటీవల కాలంలో ఆయన కలిసినవారిలో ఆందోళన నెలకొంది. అయితే ఆయన ఆరోగ్యంపై బంధువులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చెందుతుండటంతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.


కోలుకున్నా..

గత ఆదివారంనాడు కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. అలాగే ఎలాంటి సింటమ్స్ నాకు లేవు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. కరోనాకు మెడిసిన్‌తో పాటు ధైర్యంగా ఉంటే పూర్తిగా కొలుకోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండాలిఅని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.


కాగా.. తెలంగాణలో మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ కేబినెట్‌ను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-08T22:28:10+05:30 IST