రేవంత్ రెడ్డి కూడా ఓ లీడరా?: మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2021-10-23T22:05:55+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి‌పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి కూడా ఓ లీడరా?: మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి‌పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి కూడా ఓ లీడరేనా అని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేసారు. రేవంత్‌కు సబ్జెక్టు  లేదన్నారు. రేవంత్‌ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదన్నారు.  ప్రజలను ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌ను ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. దివాళా తీసిన కాంగ్రెస్‌కు రేవంత్ ప్రెసిడెంట్ అని ఆయన ఎద్దేవా చేసారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు, రేవంత్‌ను నమ్మరని ఆయన అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. బీజేపీ ఏం చేసిందని ఓట్లు అడుగుతోందని ఆయన ప్రశ్నించారు. పాలలో తోడుపెట్టి పథకాల్లో వాటా ఉందని బీజేపీ చెప్పుకుంటోందన్నారు. తెలంగాణకు బీజేపీ ఎంపీలు ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-23T22:05:55+05:30 IST