అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ : మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2021-01-17T04:37:18+05:30 IST

అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ : మంత్రి మల్లారెడ్డి

అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ : మంత్రి మల్లారెడ్డి
శామీర్‌పేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి చామకూర మల్లారెడ్డి

శామీర్‌పేట: కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచి తంగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.  శామీర్‌పేట పీహెచ్‌సీలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానందతో కలిసి ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు శని వారం కరోనా నివారణ వాక్సిన్‌ కేంద్రాన్ని  ప్రారం భించారు. పీహెచ్‌సీ డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌కు స్టాఫ్‌నర్స్‌ జ్యోతి మొదటి వ్యాక్సిన్‌ వేశా రు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరో నా మహమ్మారికి మందును కేవలం 10 నెలల్లోనే కనుగొన్న ఘనత భారత్‌ బయోటెక్‌దేనని అన్నారు. ప్రపంచ స్థాయిలో మేడ్చల్‌ జిల్లాలో వ్యాక్సిన్‌ త యారవడం గర్వకారణమని అన్నారు. మొదటి దశ లో ప్రభుత్వ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యులు, ఆశా కార్యకర్తలు, అం గన్‌వాడీ టీచర్లకు టీకాను ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో దశలో పోలీ సులు, పారిశుధ్య కార్మికులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ శంభీ పూర్‌ రాజు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ విధిగా మాస్కు లు ధరించాలని సూచించారు. మొదటిరోజు 30 మంది వైద్య,  సిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. ఎవరికీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌, డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌, ఆర్డీవో రవి, తహసీల్దార్‌ సురేందర్‌, ఎంపీడీవో శశిరేఖ, సువిధ, ఎంపీపీలు ఎల్లూబా యి, హారిక, జడ్పీటీసీలు అనిత, హరివర్ధన్‌రెడ్డి  పాల్గొన్నారు.

కీసరలో..

కీసర: కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా అదనపు వైద్యాధికారి  తుకారం భట్‌ టీకా పంపిణీని ప్రారంభించారు. మొదటి టీకా కేంద్రం వైద్యాధికారి సరిత వేసుకున్నారు. అధికారితో పాటు కేంద్రంలోని మొత్తం సిబ్బంది 30 మందికి టీకా వేసినట్లు మండల వైద్యాధికారి సరితా తెలిపారు. ఎవరికీ అనారోగ్య సమస్యలు తలెత్తలేదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ, నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కె.చంద్రారెడ్డి, వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ బి. మల్లేష్‌ యాదవ్‌, తహసీల్దార్‌ గౌరీ, ఎంపీడీవో పద్మావతి, సీఐ నరేందర్‌ గౌడ్‌, సర్పంచులు మాధురి, పెంటయ్య, గోపాల్‌రెడ్డి, సత్తమ్మ, ఎంపీటీసీ కవిత, ఉపసర్పంచులు బాలామణీ, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు. 

నారపల్లిలో..

ఘట్‌కేసర్‌: పోచారం మున్సిపాలిటీలోని నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. వైద్యాధికారి యాదగిరికి ఉదయం 11.14 గంటలకు  మొదటి  టీకా వేశారు. మరో 20 మంది స్బిందికీ టీకాలు వేశా రు. వారందరిని అరగంట పాటు నిశితంగా పరిశీలించారు.

Updated Date - 2021-01-17T04:37:18+05:30 IST