సంక్షోభంలోనూ సంక్షేమం : మంత్రి

ABN , First Publish Date - 2020-07-09T12:01:22+05:30 IST

కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

సంక్షోభంలోనూ సంక్షేమం : మంత్రి

మేడ్చల్‌ : కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం రైతువేదికలు, ప్రభుత్వ పథకాలపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. లాక్‌డౌన్‌తో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు కొనసాగించామన్నారు. రైతువేధికలు అంతటా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంటు ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌, ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. 


ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధి ఉమానగర్‌లో మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికానర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ చీర్ల రమేష్‌, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు జంగా హరికృష్ణయాదవ్‌, టిల్లు, స్వామి, దేవ, ఏఎస్సార్‌, నాయకులు నర్సింహారెడ్డి, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T12:01:22+05:30 IST