పరిశ్రమల శాఖలోనూ స్పందన

ABN , First Publish Date - 2020-10-22T09:42:14+05:30 IST

పరిశ్రమల శాఖలోనూ స్పందన కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన స్పందన వెబ్‌సైట్‌ను మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం

పరిశ్రమల శాఖలోనూ స్పందన

కడప జిల్లా కొప్పర్తిలో ఎంఎ్‌సఎంఈ పార్కు: మేకపాటి  


అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల శాఖలోనూ స్పందన కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన స్పందన వెబ్‌సైట్‌ను మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. పరిశ్రమలకు సం బంధించిన ఎలాంటి సందేహం, ఫిర్యాదు అయినా సత్వరమే స్పందిస్తామని ఆయన చెప్పారు. అనంతరం పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు.  మరోవైపు రాష్ట్రంలో బొమ్మల తయారీ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్దేశించారు. విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో బొమ్మల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేయాలన్నారు. కడపలోని కొప్పర్తి కేంద్రంగా ఎంఎ్‌సఎంఈ పార్కు ఏర్పాటుచేస్తే బాగుంటుందన్నారు.  

Updated Date - 2020-10-22T09:42:14+05:30 IST