నెల్లూరు: ఆత్మకూరు మండలం మహిమలూరులో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. తూర్పు హరిజనవాడ కాలనీ పేరును మార్చినందుకు నిరసనగా మంత్రి కాన్వాయ్ ఎదుట భాస్కర్ అనే వ్యక్తి పురుగుల మందుతాగాడు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. స్థానికులు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు.